మెట్రో ట్రాక్‌పై యువకుడు.. తృటిలో తప్పించుకున్నాడు.. వీడియో

Wed,May 23, 2018 09:57 AM

Man crosses Delhi Metro track, alert driver avoids tragedy

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని శాస్త్రీనగర్ మెట్రో రైల్వే స్టేషన్‌లో 21 ఏళ్ల మయూర్ పటేల్ అనే యువకుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మెట్రో రైలు ఓ ట్రాక్ నుంచి వెళ్లేందుకు రెఢీగా ఉన్న సమయంలో.. పటేల్ ఆ ట్రాక్ దాటబోయాడు. రెండో వైపు ఫ్లాట్‌ఫాంపై ఉన్న ఆ వ్యక్తి.. ట్రాక్ మీద నుంచి మరో ఫ్లాట్‌ఫాంపైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఆ ట్రాక్‌పై ఉన్న రైలు కదిలింది. ట్రాక్ మీద నుంచి ఫ్లాట్‌ఫాం ఎక్కుతుండగానే రైలు స్టార్ట్ అయ్యింది. కానీ ఆ యువకుడు ఫ్లాట్‌ఫాం ఎక్కలేకపోయాడు. ఇక దాదాపు మెట్రో రైలు కింద ఆ యువకుడి పడిపోబోయాడు. కానీ మెట్రో రైలు డ్రైవర్ అప్రమత్తతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డ్రైవర్ బ్రేక్ వేయడంతో అతను సురక్షితంగా ఉన్నాడు. ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ యువకుడికి జరిమానాతో పాటు జైలు శిక్షను విధించే అవకాశాలు ఉన్నాయి.5026
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles