కక్షతో పాము తలనే కొరికాడు..Tue,February 20, 2018 11:57 AM

కక్షతో పాము తలనే కొరికాడు..

లక్నో : ఓ వ్యక్తి తన పశువులను మేపుతుండగా.. అతడిని పాము కాటేసింది. కాటేసిన పామును ఊరికినే విడిచిపెట్టొద్దు అనుకొని.. ఆ పామును పట్టుకొని దాన్ని తలను కొరికి కక్ష తీర్చుకున్నాడు రైతు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని శుక్లాపూర్ భగర్ గ్రామంలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సోనేలాల్ అనే రైతు తన పొలంలో పశువులను మేపుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడిని పాము కాటేసింది. దీంతో ఆ పామును పట్టుకొని దాన్ని తల కొరికి, నమిలి ఉమ్మివేశాడు. పాము తలను నమలడంతో రైతు స్పృహ కోల్పోయాడు. దీంతో అక్కడున్న స్థానికులు.. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించిన కాసేపటి తర్వాత రైతు స్పృహలోకి వచ్చాడు. తనను కాటేసినందుకే.. పాము తలను కొరికానని బాధితుడు చెప్పాడు.

4994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS