హత్యకు దారితీసిన వాగ్వాదం

Sat,January 12, 2019 10:24 AM

Man Beats Neighbour To Death With Digging Fork After Argument

న్యూఢిల్లీ: ఇరువురి వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం చివరికి ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద సంఘటన న్యూఢిల్లీలో గడిచిన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఇంద్రజిత్ మిశ్రా అనే వ్యక్తి రాణా పార్క్ ఏరియాలో ఉన్న సోదరి ఇంటికి వెళ్లాడు. బావ తమ్ముడు గౌతమ్ కుమార్(23)తో కలిసి బైక్ పై ఇరువురు బయటికి వెళ్లారు. బైక్ ను రోడ్డు ప్రక్కగా పార్క్ చేసి మాట్లాడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన ధన్ కుమార్ అలియాస్ సంజయ్(29) తన మినీ ట్రక్కుతో వచ్చి బైక్ ఢీకొట్టాడు. దీంతో గౌతమ్ కు సంజయ్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో సంజయ్ తన వద్ద ఉన్న ఫోర్క్ ను తీసి గౌతమ్ పై విచక్షణరహితంగా దాడి చేశాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన ఫోర్క్ స్వాధీనం చేసుకున్నారు.

1712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles