ప్రాణాలు తీసిన కుటుంబ వివాదం..

Thu,May 16, 2019 03:29 PM

Man beaten to death by his wife, in laws in up


ముజఫర్‌నగర్: యూపీలో ఓ వ్యక్తి దారుణంగా చంపబడ్డాడు. కొత్వాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖేడి కర్ము గ్రామంలో హరీశ్ (31)పై అతని భార్య శివానీ, ఆమె బంధువులు దాడి చేయగా..తీవ్రగాయాలతో హరీశ్ ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకు హరీశ్ శివానీ కుటుంబసభ్యుల పెళ్లికి హాజరయేందుకు వెళ్లాడని, ఓ విషయమై హరీశ్‌కు, శివానీ కుటుంబసభ్యులకు మధ్య గొడవ జరగడంతో..హరీశ్‌పై శివానీ మిగతావారు దాడి చేసి చంపేశారని హరీశ్ తల్లి ఫిర్యాదు చేసింది. హరీశ్ ను చంపిన తర్వాత అతని మృతదేహాన్ని నాలాలో పడేశారని షామిలీ జిల్లా ఎస్‌హెచ్‌వో సుభాష్ రాథోడ్ తెలిపారు. హరీశ్ తల్లి ఫిర్యాదు మేరకు శివానీతోపాటు ఆమె సోదరుడు మోహిత్, తల్లి అంజు, బంధువు శివమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

1520
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles