టోల్‌ప్లాజా ఉద్యోగినిపై దాడికి యత్నం..వీడియో

Thu,December 7, 2017 04:57 PM

Man attempts to beat a female toll plaza employee in Gurugram


గురుగ్రామ్ : ఓ వ్యక్తి టోల్‌ప్లాజా ఉద్యోగినిపై దాడికి యత్నించిన ఘటన గురుగ్రామ్‌లో జరిగింది. కారులో వెళ్తున్న సదరు వ్యక్తి గురుగ్రామ్‌లోని టోల్‌ప్లాజా వద్ద గేట్ పడటంతో తన కారును ఆపాడు. టోల్‌ప్లాజా ఉద్యోగిని ట్యాక్స్ కట్టాలని కారు యజమానికి సూచించింది. అతడు ట్యాక్స్ కట్టకుండా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో టోల్‌ప్లాజా ఉద్యోగిని ఖచ్చితంగా కట్టాల్సిందేనని చెప్పింది. ఆ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోతూ ఉద్యోగినిపై దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటనపై ఉద్యోగిని మాట్లాడుతూ..కారులో వచ్చిన అతడు లోకల్ వ్యక్తినని ట్యాక్స్ తీసుకోకుండా పంపించాలని వారించాడు. డాక్యుమెంట్స్ చూపించమని అడిగితే నన్ను చంపుతానని బెదిరిస్తూ దాడికి యత్నించాడని వెల్లడించింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
1770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles