నగ్న సెల్ఫీ అడిగిన వరుడు..పెళ్ళి రద్దు

Sat,August 22, 2015 06:01 PM

Man asks fiancee for nude selfie


కల్యాన్: ఈ రోజుల్లో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంటే ప్రేమ వెర్రి తలలు వేస్తుందనడానికి ఇది నిదర్శనం. మహారాష్ట్రలో కాబోయే భార్యను నగ్న సెల్ఫీ దిగి తనకు పంపమన్నాడు ఓ ప్రబుద్ధుడు. దీనికి చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి అతనితో తన పెళ్లిని రద్దు చేసుకుంది. థానే జిల్లాకు చెందిన కాల్ సెంటర్ ఉద్యోగి జితేంద్ర రాధాకృష్ణ థాకూర్(33) అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో జూన్‌లో పెళ్ళి నిశ్చయమైంది. జితేంద్ర తనకు కాబోయే భార్యను నగ్నంగా ఫొటో దిగి పంపమన్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. అందుకు అతడు నగ్న సెల్ఫీ పంపకపోతే పెళ్ళి రద్దు చేసుకుంటానని బెదిరించాడు. మూడు లక్షల అదనపు కట్నాన్ని డిమాండు చేశాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. థానే పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

3552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles