అమెజాన్‌ను ముంచిన యువకుడు అరెస్ట్‌

Thu,January 31, 2019 10:08 AM

Man Arrested For Allegedly Duping Amazon Of Rs 30 Lakh In Indore

ఇండోర్‌ : ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ను ఓ యువకుడు భారీగా మోసం చేశాడు. ఖరీదైన వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసి రూ. 30 లక్షల మేర మోసం చేసినట్లు తేలింది. ఇండోర్‌కు చెందిన మహ్మద్‌ మహువాలా(27) ఫేక్‌ ఈమెయిల్‌ అకౌంట్స్‌, ఫోన్‌ నంబర్లతో పలు అకౌంట్లను క్రియేట్‌ చేసి ఖరీదైన గ్యాడ్జెట్స్‌, మొబైల్‌ ఫోన్స్‌ను కొనుగోలు చేశాడు. ఆ వస్తువులు తన వద్దకు వచ్చాక వాటిని తీసేసుకొని.. స్థానికంగా ఉన్న దుకాణదారులకు తక్కువ ఖరీదుకు అమ్మేస్తున్నాడు. ఇక ఆ తర్వాత తనకు వచ్చిన పార్శిల్‌ ఖాళీగా ఉందని చెప్పి.. తిరిగి అమెజాన్‌ సంస్థకు పంపేవాడు. అమెజాన్‌ కూడా ఇతడికి నగదును రిఫండ్‌ చేసేది. ఈ విధంగా రూ. 30 లక్షల మేర అమెజాన్‌ సంస్థను ఆ యువకుడు మోసం చేశాడు. మొత్తానికి అమెజాన్‌ సంస్థ యాజమాన్యానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతన్ని నుంచి ఖరీదైన మొబైల్‌ ఫోన్స్‌ను, రెండు స్మార్ట్‌ గడియారాలు, క్రెడిట్‌ కార్డు, వైర్‌లెస్‌ రూటర్‌తో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి అమెజాన్‌ సంస్థలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు సహాయపడినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిని కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు.

3295
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles