ప్రాంతీయ పార్టీల 'ఫ్రంట్' విజయం: మమతా

Sat,May 19, 2018 04:53 PM

mamatha benerji sai it is Victory of the regional front

కోల్‌కతా: విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన యడ్యూరప్ప తన భావోద్వేగ ప్రసంగం ముగింపులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు. తన రాజీనామాను సమర్పించేందుకు రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో మే 21న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతుతో జేడీఎస్ ముఖ్యనేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ అప్రజాస్వామికంగా గెలవాలనుకున్న బీజేపీ ఎట్టకేలకూ విశ్వాస పరీక్షలో ఓటమి తప్పదని భావించి విశ్వాస పరీక్షకు ముందే యెడ్డీ రాజీనామా చేశారు. దీనిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ట్విటర్ ద్వారా స్పందించారు.

ప్రజాస్వామ్యం గెలిచింది. కర్ణాటక ప్రజలకు, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ, ఆ పార్టీ ముఖ్యనేత కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీతో పాటు తదితరులకు అభినందనలు. ఇది ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ విజయం. అని మమతా పేర్కొన్నారు.2777
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS