విపక్షాలకు సీఎం మమతా బెనర్జీ కృతజ్ఞతలు

Thu,May 16, 2019 12:56 PM

Mamata Banerjee thanks opposition leaders for backing her

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విపక్షాలకు కృతజ్ఞతలు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంపై నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా తనకు మద్దతు ఇచ్చిన విపక్ష మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నట్లు మమత ట్వీట్ చేశారు. ఏడో దశ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెరపడనుంది. అయితే టీఎంసీ, బీజేపీల మధ్య చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం.. పశ్చిమ బెంగాల్‌లో గురువారం రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచారం చేయాలని, ఆ తర్వాత చేయొద్దని ఆదేశాలిచ్చింది. దీంతో ఈసీపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆమె నిరసన వ్యక్తం చేశారు. దీంతో మమతకు మాయావతి, అఖిలేష్ యాదవ్, చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మమత ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ డైరెక్షన్‌లో ఈసీ పని చేస్తుందని మమత ధ్వజమెత్తారు. బీజేపీకి బెంగాల్ ప్రజలు తగిన సమాధానం చెప్తారని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.1462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles