డాక్టర్ల నిరసనకు మద్దతుగా మమత మేనల్లుడు

Fri,June 14, 2019 01:23 PM

Mamata Banerjee nephew Dr Abesh joins doctors protests at Kolkata hospital

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీరు పట్ల ఆ రాష్ట్ర వైద్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల సమస్యలు పరిష్కరించకుండా.. విధుల్లో చేరాలని మమత అల్టిమేటం జారీ చేయడంతో.. తమ నిరసనలను మరింత తీవ్రతరం చేశారు బెంగాల్‌ వైద్యులు. డాక్టర్ల నిరసనకు మమత మేనల్లుడు అబేష్‌ బెనర్జీ మద్దతు తెలిపారు. కోల్‌కతాలోని కేపీసీ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్య అభ్యసిస్తున్న అబేష్‌ బెనర్జీ వైద్యుల ధర్నాలో పాల్గొన్నారు. మేము దేవుళ్లమని మీరే చెప్తారు.. మరి కుక్కల్లా మమ్మల్ని ఎందుకు ట్రీట్‌ చేస్తున్నారు అని రాసి ఉన్న పోస్టర్‌ను అబేష్‌ ప్రదర్శించారు.

కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో నాలుగు రోజుల క్రితం ఓ రోగి మృతి చెందడంతో.. ఆ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని బెంగాల్‌ జూడాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.1320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles