ఓవైపు దీక్ష.. మరోవైపు పోలీసులకు అవార్డులు!

Mon,February 4, 2019 05:49 PM

Mamata Banerjee gives awards to Police in Kolkata while protesting

కోల్‌కతా: ఓవైపు కేంద్రంపై నిరసనను కొనసాగిస్తూనే మరోవైపు రాష్ట్ర పోలీసులకు అవార్డులు ప్రదానం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తాను నిరవధిక దీక్ష చేస్తున్న స్టేజ్ పక్కనే మరో స్టేజ్‌పై ఆమె ఈ అవార్డులు ఇవ్వడం విశేషం. కీలకమైన రోజ్ వ్యాలీ, శారత చిట్‌ఫండ్స్ కుంభకోణాల కేసులను డీల్ చేస్తున్న కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ వాటికి సంబంధించిన సాక్ష్యాలను లేకుండా చేశారని సీబీఐ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ అధికారులు రాగా.. రాష్ట్ర పోలీసులే వాళ్లను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం తీరును నిరసిస్తూ మమతా దీక్షకు దిగారు. అదే వేదికపై నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగానే పోలీసులకు ఆమె అవార్డులను ఇచ్చారు. మరోవైపు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రెండేళ్లుగా ఆయనకు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాలేదని కోర్టుకు చెప్పింది. కానీ రాజీవ్ కుమార్ ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీస్ అధికారి అంటూ మమతా ఆయనను వెనకేసుకొస్తున్నారు.


2057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles