జూనియర్‌ డాక్టర్లకు దీదీ వార్నింగ్‌

Thu,June 13, 2019 01:16 PM

Mamata Banerjee 4 Hour Ultimatum to Striking Doctors

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని జూనియర్‌ డాక్టర్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వార్నింగ్‌ ఇచ్చారు. నిరసనను నిలిపివేసి నాలుగు గంటల్లోగా విధుల్లో చేరాలని డాక్టర్లను దీదీ హెచ్చరించింది. కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ఓ రోగి మృతి చెందాడు. దీంతో రోగి బంధువులు జూడాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ ఘటనకు నిరసనగా గత మూడు రోజుల నుంచి జూడాలు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను పోస్టర్ల రూపంలో ప్రభుత్వానికి తెలియజేశామని, తమకు న్యాయం చేయాలని జూడాలు డిమాండ్‌ చేశారు. దీంతో ఆందోళనకు దిగిన జూడాల వద్దకు సీఎం మమతా బెనర్జీ వెళ్లారు. తమకు న్యాయం కావాలని సీఎం ఎదుట జూడాలు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఎవరైతే విధుల్లో చేరాలనుకోవడం లేదు వారు ఆస్పత్రి నుంచి వెళ్లిపోవచ్చని ఆమె స్పష్టం చేశారు. విధుల్లో చేరని వారు బయటి వారు అని పేర్కొన్నారు. ఇలాంటి నిరసనలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోదు. ధర్నాకు దిగిన డాక్టర్ల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. విధి నిర్వహణలో పోలీసులు ఎంతో మంది చనిపోతున్నారు. వారు కూడా మీలాగే ధర్నాలకు దిగుతున్నారా? అని మమత ప్రశ్నించారు.2108
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles