త్వరలో విజ‌య్ మాల్యా ఆస్తుల వేలం

Sun,July 31, 2016 04:47 PM

Mallya's assets to go under hammer

ముంబై: బ‌్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌నామం పెట్టి లండ‌న్ పారిపోయిన పారిశ్రామికవేత్త విజ‌య్ మాల్యా ఆస్తుల‌ను వేలం వేయ‌డానికి మ‌రోసారి బ్యాంకులు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇంత‌కుముందు కూడా వేలానికి ప్ర‌య‌త్నించినా.. బేస్‌ప్రైస్ ఎక్కువున్న కార‌ణంగా బిడ్డ‌ర్లు రాక‌పోవ‌డంతో ఇప్పుడు మ‌రోసారి వేలానికి ప్ర‌క‌ట‌న జారీచేశాయి. న‌ష్టాల్లో కూరుకుపోయి మూత‌ప‌డిన‌ కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన‌ సుమారు 700 కోట్ల విలువైన ఆస్తుల‌ను ఆగ‌స్ట్ 4న వేలం వేయ‌నున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్ స‌మీపంలో ఉన్న కింగ్‌ఫిష‌ర్ హెడ్‌క్వార్టర్స్ బిల్డింగ్‌తోపాటు కార్లు, ఆఫీస్ ఫ‌ర్నీచర్‌, మాల్యా వ్య‌క్తిగ‌త జెట్ విమానం వేలానికి రానున్నాయి. కింగ్‌ఫిష‌ర్ లోగో, గోవాలో ఉన్న కింగ్‌ఫిష‌ర్ విల్లా కూడా వేలంలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాయి.

మాల్యా వ్య‌క్తిగ‌త జెట్‌ను సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వేలం వేయ‌నుండ‌గా.. మిగ‌తావాటిని బ్యాంకులు వేలం వేస్తాయి. ఈ ఆస్తుల‌న్నింటి బేస్‌ప్రైస్‌ను గ‌తంలో కంటే త‌గ్గించారు. ఎయిర్‌లైన్స్ హెడ్‌క్వార్ట‌ర్స్ బిల్డింగ్ బేస్‌ప్రైస్ గ‌తంలో 150 కోట్లు ఉండ‌గా.. ఇప్పుడు 135 కోట్ల‌కు త‌గ్గించారు. మాల్యాకు చెందిన ఎనిమిది కార్లు, మిగ‌తా సామ‌గ్రిని ఆగ‌స్ట్ 25న ప్ర‌త్యేకంగా వేలం వేయ‌నున్నారు. ఎయిర్‌లైన్స్ మంచి లాభాల్లో ఉన్న‌పుడు దాని విలువ 4 వేల కోట్లుగా ఉండ‌గా.. ఇప్పుడు వేలంలో వాటి విలువ 330 కోట్ల‌కు ప‌డిపోయింది.

1672
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles