బ్యాంకు అప్పు నూటికి నూరుపాళ్లు కడతానన్న మాల్యా

Wed,December 5, 2018 04:37 PM

mallya offers to repay bank debts 100 percent

బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి మాల్యా ఇప్పుడు ఓ ఆఫర్ ఇచ్చారు. బ్యాంకులకు ఇవ్వాల్సిన అసలు మొత్తం తిరిగి చెల్లిస్తానని అంటున్నారు. వడ్డీమాట మాత్రం ఎత్తడం లేదు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఇందన ధరలు పెరగడం వల్ల మునిగిపోయిందని, బ్యాంకులనుంచి తెచ్చిపోసిన డబ్బంతా ఆ నష్టం పూడ్చుకోవడానికే సరిపోయిందని ట్విట్టర్‌లో మాల్యా తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆయన రు.9 వేల కోట్లకు పైగా అప్పుపడ్డారు. బ్యాంకులు అప్పుల వసూలు కొరకు చట్టపరమైన చర్యలు చేపట్టడంతో బ్రిటన్‌కు పారిపోయారు. అతడిని అరెస్టు చేసి తమకు అప్పగించాలని భారత్ అక్కడి ప్రభుత్వానికి అధికారికంగా నివేదన పంపింది. త్వరలో బ్రిటన్ దానిపై నిర్ణయం తీసుకోనున్నది. ఈ నేపథ్యంలో మాల్యా బేరం పెట్టడం, బేలగా మాట్లాడడం గమనార్హం.

941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles