టీవీ యాంకర్‌కు 2 వేల బూతు ఫోన్ కాల్స్

Tue,March 1, 2016 04:39 PM

Malayalam TV anchor threatened, abused after moderating debate on Mahishasur Jayanti

కేరళ : కేరళలోని ఏషియానెట్ టీవీ యాంకర్ సింధు సూర్యకుమార్‌కు 2 వేల బూతు ఫోన్ కాల్స్ వచ్చాయి. వేల సంఖ్యలో ఆమెకు బూతు కాల్స్ ఎందుకు వచ్చాయంటే.. మహిషాసుర జయంతిని జరుపుకోవడాన్ని దేశద్రోహంగా పరిగణించాలా.. వద్దా అనే అంశంపై ఫిబ్రవరి 26న సింధు చర్చా కార్యక్రమం నిర్వహించారు. నాటి నుంచి నేటి వరకు ఆమెను తిడుతూ ఫోన్ కాల్స్ వచ్చాయి. చర్చా కార్యక్రమంలో భాగంగా హిందూ దేవత ఒకరిని సెక్స్ వర్కర్‌గా సింధు అభివర్ణించారని ఆరోపణలు ఉన్నాయి.

దీంతో ఆమెపై జనం ఆవేశంతో.. సింధు ఫేస్‌బుక్ పేజీలో తీవ్ర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. అంతే కాకుండా ఆమె ఫోన్ నెంబర్ కూడా ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసి.. నేరుగా ఆమెకే ఫోన్ చేసి తిట్టాలని సూచనలు చేశారు. ఇక ఆమెకు లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫోన్ కాల్స్‌తో విసిగిపోయిన సింధు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సింధు ఇచ్చిన ఫోన్ నెంబర్ల ప్రకారం.. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, శ్రీరామసేన లాంటి సంస్థలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. అయితే.. దేవతను తిడుతూ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేత వీవీ రాజేశ్ ఓ కరపత్రంలో చదివారని, దాన్ని దేశద్రోహం అని ఎలా అంటారని మాత్రమే అడిగానని సింధు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. హిందూ దేవతను సెక్స్ వర్కర్‌గా చెప్పడంలో తప్పేంటని తాను అనలేదని ఖండించారు.

4297
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles