ఎయిర్‌పోర్ట్‌లలో మూత్రం నిల్వ చేయమని చెప్పిన కేంద్ర మంత్రి.. ఎందుకో తెలుసా?

Mon,March 4, 2019 12:57 PM

నాగపూర్: వినూత్న ఆలోచనలకు పెట్టింది పేరు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. గతంలో ఎన్నోసార్లు ఆయన కొత్త కొత్త ఐడియాలు ఇచ్చారు. ఈసారి అలాంటిదే మరో ఐడియాతో వచ్చారు. నాగపూర్‌లో జరిగిన మేయర్ ఇన్నోవేషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. మూత్ర నుంచి యూరియా తయారు చేయాలని సూచించడం విశేషం. ఈ పని చేస్తే అసలు ఇండియా యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే రాదని ఆయన అన్నారు. ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ.. సహజ వ్యర్థాల నుంచి జీవ ఇంధనాలను ఎలా తయారు చేయొచ్చో గడ్కరీ చెప్పారు. మనుషుల మూత్రంతోనూ జీవ ఇంధనం తయారు చేయవచ్చని, అందులో నుంచి అమోనియం సల్ఫేట్, నైట్రోజన్‌లను వెలికి తీయొచ్చని ఆయన తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లలో మూత్రాన్ని నిల్వ చేయమని నేను చెప్పాను. మనం యూరియాను దిగుమతి చేసుకుంటాం. కానీ దేశంలోని అందరి మూత్రాన్ని మనం స్టోర్ చేసి పెడితే.. అసలు మనకు యూరియా దిగుమతి అవసరమే రాదు.


అంతేకాదు ఏదీ వృథా కాదు అని గడ్కరీ అన్నారు. నా ఆలోచనలన్నీ అత్యద్భుతంగా ఉంటాయి కాబట్టే..ఎవరూ నాకు సహకరించరు అని ఆయన చెప్పడం విశేషం. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్డిగా ఓ పని చేస్తూ వెళ్లేలా శిక్షణ ఇస్తారని, అందుకే వాళ్లు కూడా ఇలాంటి ఆలోచనలను స్వాగతించరని అన్నారు. కొన్నేళ్ల కిందట కూడా గడ్కరీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తన ఇంట్లోని తోటకు యూరియాగా తన మూత్రాన్నే వాడతానని ఆయన చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇక మనుషుల వెంట్రుకల నుంచి అమినో యాసిడ్‌ను వెలికి తీయొచ్చని, ఇది ఎరువుగా పని చేస్తుందని ఆయన అన్నారు. దీనికోసం తాను తిరుపతి నుంచి ఐదు ట్రక్కుల వెంట్రుకలను ప్రతి నెలా తెప్పించేవాడినని, ఈ ఎరువు వాడిన తర్వాత 25 శాతం దిగుబడి పెరిగిందని గడ్కరీ అప్పట్లో చెప్పారు. విదేశాల నుంచి కూడా అమినో యాసిడ్‌కు ఆర్డర్లు వస్తున్నాయని, 180 కంటేనర్ల యాసిడ్‌ను ఎగుమతి చేస్తున్నామని ఆయన తెలిపారు.

2930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles