రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

Tue,April 2, 2019 12:18 PM

Major mishap averted as Rajdhani Express coaches separate

భువనేశ్వర్‌ : భువనేశ్వర్‌ - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ నుంచి బోగీలు విడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఇవాళ ఉదయం 9:30 గంటలకు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీకి బయల్దేరింది. 20 నిమిషాల తర్వాత కత్తజోడి వంతెనపై ఇంజిన్‌ నుంచి బోగీలు విడిపోయాయి. ఈ ఘటన కటక్‌ రైల్వే స్టేషన్‌కు కొద్ది దూరంలో చోటు చేసుకుంది. మొత్తానికి రైలును ఆ వంతెనపైనే ఆపి అధికారులు మరమ్మతులు చేశారు. అనంతరం రైలును కటక్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే రైలు ఇంజిన్‌ నుంచి విడిపోయిన బీ3, బీ4 బోగీలు వంతెనను దాటి.. వెళ్లిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

2163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles