వివాదాస్పద ట్వీట్‌.. ఐఏఎస్‌ ట్రాన్స్‌ఫర్‌

Tue,June 4, 2019 11:03 AM

Maharashtra IAS Officer Who Posted Controversial Tweet on Mahatma Gandhi Transferred

ముంబయి: మహాత్మాగాంధీపై వివాదాస్పద ట్వీట్‌ చేసిన మహారాష్ట్ర ఐఏఎస్‌ అధికారి నిధి చౌదరి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. బృహక్‌ ముంబయి కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ స్థానం నుంచి నీటి సరఫరా విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అదేవిధంగా వ్యంగ్య ట్వీట్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం షోకాజ్‌ నోటిసు జారీచేసింది. ఐఏఎస్ నిధి చౌదరి చేసిన ట్వీట్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలు మండిపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాలను తొలిగించాలని, భారత కరెన్సీ నోట్లపై ఉన్న ఆయన బొమ్మను తీసేయాలంటూ ఐఏఎస్ అధికారిణి, బృహక్ ముంబై కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నిధి చౌదరి గతనెల 17న ట్వీట్ చేశారు. గాంధీని హత్యచేసిన గాడ్సేకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో దాన్ని తొలిగించారు.

ట్వీట్ వ్యగ్యంగా పెట్టానని, దీన్ని అపార్థం చేసుకున్నారని ఆమె వివరణ ఇచ్చారు. నేను గాంధేయవాదిని. గాంధీ లేదా ఏ ఇతర స్వాతంత్య్ర సమరయోధులను కించపరచను. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో గాంధీజీకి వ్యతిరేకంగా నడుస్తున్న తీరుపై వ్యగ్యంగా స్పందించాను. ఇది చట్టవ్యతిరేకమైనదేమీ కాదు. ట్వీట్ మొత్తం చదివితే ఈ విషయం అర్థమవుతుంది అని పేర్కొన్నారు.

2172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles