పాట పాడిన‌ మహారాష్ట్ర సీఎం.. వీడియో వైర‌ల్‌

Tue,February 27, 2018 10:07 AM

Maharashtra CM Fadnavis and his Wife sings for a Video on Mumbais Rivers

ముంబై : మహారాష్ట్రలోని మహానగరం ముంబై చుట్టున్న నదులను సంరక్షించుకోవాలన్న సంకల్పంతో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన భార్య అమృతా ఫడ్నవీస్ ప్రత్యేకంగా ఓ వీడియో సాంగ్‌ను రూపొందించారు. ఇప్పుడు ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఆ సాంగ్‌ను తప్పుపడుతున్నాయి. ముంబై చుట్టూ మొత్తం నాలుగు నదులు ఉన్నాయి. పొయ్‌సర్, దహిసర్, ఓషివారా, మితి నదులు ముంబై ప్రాంతంలో ప్రవహిస్తాయి. ఆ నదుల నీటిని కాపాడుకోవాలంటూ ఆ సాంగ్‌లో సీఎం ఫడ్నవీస్, ఆయన భార్య అమృత వేడుకుంటారు. అయితే ఆ పాటలో వాళ్లు ఇద్దరూ నటించారు. సీఎం దంపతులు సాంగ్‌లో నటించడం షాకింగ్‌గా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దీనిపై మహారాష్ట్ర సీఎం కార్యాలయం స్పందించింది. ఇదో సామాజిక అంశమని, సాంగ్‌ను ప్రైవేటుగా రూపొందించామని, ప్రభుత్వానికి చెందిన ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని సీఎం కార్యాలయం పేర్కొన్నది. ఇదే ఆ సాంగ్ వీడియో. టీసిరీస్ ఈ సాంగ్‌ను రిలీజ్ చేసింది. సోనూ నిగమ్ కూడా గాత్రం అందించారు.


2383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS