మ‌హారాష్ట్ర అసెంబ్లీ: 288 సీట్లు.. 8.94 కోట్ల ఓట‌ర్లు

Sat,September 21, 2019 12:33 PM

హైద‌రాబాద్‌: మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇవాళ ఎన్నిక‌ల సంఘం తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఈ ఏడాది అక్టోబ‌ర్ 21వ తేదీన ఆ రాష్ట్ర ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. మ‌హా అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. దీంట్లో 234 మంది జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీ అభ్య‌ర్థులు ఉన్నారు. 29 మంది షెడ్యూల్ కులాలు, 25 మంది షెడ్యూల్ తెగ‌ల‌కు కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం 96 వేల 654 పోలింగ్ స్టేష‌న్లు ఉన్నాయి. ఒక ఓట‌రు బూత్‌కు స‌గ‌టున 925 మంది ఓట‌ర్లు ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ మొత్తం 122 సీట్లు గెలుచుకున్న‌ది. ఆ త‌ర్వాత శివ‌సేన 63 స్థానాల్లో, కాంగ్రెస్ 42, ఎన్‌సీపీ 41 స్థానాల్లో విజయం సాధించింది. చిన్న పార్టీలు, స్వ‌తంత్య్ర అభ్య‌ర్థులు 20 సీట్ల‌లో నెగ్గారు. అయితే 2019 మే నెల వ‌ర‌కు కొత్త‌గా 8 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు జ‌త‌క‌లిశారు. ఈ ఏడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌హారాష్ట్ర ఓట‌ర్ల సంఖ్య 8, 86, 77,046. ఇప్పుడు ఆ సంఖ్య 894,46,211కు చేరుకున్న‌ది. ప్ర‌స్తుత మ‌హారాష్ట్ర అసెంబ్లీ గ‌డ‌వు న‌వంబ‌ర్ 9వ తేదీన ముగియ‌నున్న‌ది. ఇవాళ్టి నుంచే ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమ‌లులోకి వ‌స్తుంది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో మీడియా పాత్ర కూడా కీల‌క‌మైంద‌ని చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునిల్ ఆరోరా తెలిపారు.

554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles