రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ ముర‌ళీ మోహ‌న్ కోడ‌లు

Fri,April 19, 2019 11:26 AM

Maganti Roopa injured in road accident

సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహ‌న్ త‌ల్లి మాగంటి వ‌సుమ‌తి దేవి (100) అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు ఆమె అంత్య‌క్రియ‌లు విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నున్నాయి. అయితే అంత్య‌క్రియ‌ల‌లో పాల్గొనేందుకు మురళీ మోహన్‌ కోడలు మాగంటి రూపాదేవి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ రోజు ఉదయం కారులో విజ‌య‌వాడ‌కి వెళుతుండ‌గా, ఆమె కారు ప్ర‌మాదానికి గురైంద‌ట‌. ఈ ప్ర‌మాదంలో రూపాదేవికి , ఆమె కూతురికి గాయాలైన‌ట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందిన రూపా కొద్ది సేప‌టి త‌ర్వాత డిశ్చార్జ్ అయిన‌ట్టు స‌మాచారం. ముర‌ళీ మోహ‌న్ తల్లి అంతిమ యాత్ర‌ జేఎన్ రోడ్‌లోని మురళీమోహన్ ఇంటి నుంచి ప్రారంభం కానున్నాయి.

4280
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles