భార్యను, ఆమె చెల్లిని ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న భర్త.. వీడియో

Wed,December 11, 2019 01:05 PM

భోపాల్‌ : భార్య సమ్మతితో ఓ భర్త ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. అంతే కాదు మొదటి భార్యకు కూడా అదే వేదికపై మరోసారి తాళికట్టి పూలదండలు మార్చుకున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ భింద్‌ జిల్లాలోని గుడవాలి గ్రామంలో నవంబర్‌ 26న చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఆ పెళ్లి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీపు పరిహార్‌(35), వినీత(28)కు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. గుడవాలి గ్రామ సర్పంచ్‌గా వినీత కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పిల్లలను బాధ్యతగా చూసుకునేందుకు వినీతకు కష్టమైంది.


దీంతో తాను మరో పెళ్లి చేసుకుంటానని దీపు పరిహార్‌.. వినీతను కోరాడు. మరో పెళ్లికి వినీత అంగీకరించడంతో.. ఆమె చెల్లి రచన(22)ను దీపు పరిహార్‌ నవంబర్‌ 26న పెళ్లి చేసుకున్నాడు. ఇదే వేదికపై వినీతకు పరిహార్‌ తాళి కట్టి దండాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా పరిహార్‌ మాట్లాడుతూ.. వినీత సమ్మతితోనే రచనను తాను పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేశారు. వినీత ఈ మధ్యకాలంలో అనారోగ్యానికి గురైంది. అదే విధంగా పిల్లలను చూసుకునేందుకు ఎవరూ లేరు. దీంతో వినీత చెల్లిని పెళ్లి చేసుకున్నాను అని పరిహార్‌ పేర్కొన్నారు.

3708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles