ఫోటో వైరల్.. సారీ చెప్పిన పోలీసులు

Fri,June 22, 2018 01:44 PM

lynching photo goes viral, Uttar Pradesh police say sorry

హాపుర్ : ఓ వ్యక్తిని చావబాది ఈడ్చుకెళ్లిన ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ పోలీసులు క్షమాపణలు చెప్పారు. గోవులను చంపాడన్న ఉద్దేశంతో హాపుర్‌లో గ్రామస్తులు ఓ వ్యక్తిని చితకబాదారు. ఆ తర్వాత అతన్ని ఈడ్చుకెళ్లారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ముగ్గురు పోలీసులు అలా చూస్తు ఉండిపోయారు. అయితే దానికి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. మనుషుల్ని కొట్టి ఈడ్చుకెళ్తుంటే పోలీసులు చూస్త్తూ ఉండిపోయారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో యూపీ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ఫోటోలో ఉన్న నిందితుడు కాసిమ్.. గ్రామస్థులు కొట్టిన దెబ్బలకు చనిపోయాడు. ఈ కేసులో మౌనంగా ఉండిపోయిన ముగ్గురు పోలీసుల్ని డ్యూటీ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. బైక్‌లను దొంగతనం చేయడం వల్ల కాసిమ్ అనే వ్యక్తిని గ్రామస్థులు కొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో గోవులను అమ్మిన కోణం లేదని వారంటున్నారు. అయితే నిందితుడు కాసిమ్‌ను పోలీసులు ముందే లాక్కెళ్లుతున్న ఫోటో వైరల్ కావడంతో ఆ రాష్ట్ర పోలీస్ శాఖ సారీ చెప్పింది. ఆ ఘటన పట్ల దర్యాప్తుకు కూడా ఆదేశించినట్లు యూపీ పోలీస్ ప్రతినిధి రాహుల్ శ్రీవాత్సవ్ తెలిపారు.2997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles