వధువు మెడలోకి పూలమాల విసిరిన లవర్!

Sat,April 21, 2018 10:49 AM

lover throws garland on bride at wedding in Uttar Pradesh

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు ఫిల్మ్ స్టయిల్‌లో అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. పెళ్లి వేడుకలో స్టేజ్ మీద ఉన్న వధువుకు.. ఓ అబ్బాయి సడన్‌గా వచ్చి మెడలో పూలమాల వేశాడు. పక్కనే పెళ్లి కొడుకు ఉన్నా అతనేమీ చేయలేకపోయాడు. ఈ ఘటన నగీనా జిల్లాలో జరిగింది. 24 ఏళ్ల రాహుల్.. పెళ్లి జరుగుతున్న వేడుక దగ్గరకు బైక్ మీద వచ్చాడు. ఆ తర్వాత స్టేజ్‌కు కొంచం దూరం ఉన్న అతను.. తన చేతిలో ఉన్న పూలమాలను తీసి వధువు వైపు విసిరాడు. ఆ మాల కాస్త నేరుగా వెళ్లి పెళ్లి కూతురు మెడలో పడింది. దీంతో అక్కడున్న విజిటర్స్ అందరూ స్టన్ అయ్యారు. పెళ్లి కూతురు కూడా ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి తన మెడలో ఉన్న పూలమాలను అతని మెడలో వేసింది. ఆ షాక్ నుంచి కోలుకునేందుకు అతిథులకు టైం పట్టింది. కానీ వధువు తరపున బంధువులు వచ్చి ఆ అబ్బాయిని చితకబాదారు. వరుడు తరపున బంధువులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఇక పోలీసులు వచ్చి ఆ అబ్బాయిని అరెస్టు చేశారు. అమ్మాయి దళితురాలు కాగా, అబ్బాయి ఉన్నత కులానికి చెందినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు.

5112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS