రాముడు అందరివాడు.. అయోధ్యలోనే ఆలయం ఎందుకు?

Tue,November 27, 2018 11:46 AM

Lord Ram is omnipresent why temple only in Ayodhya asks Farooq Abdullah

న్యూఢిల్లీ: వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు అంశంపై స్పందించారు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. రాముడు అంతటా ఉన్నాడు. ఆయన అందరివాడు. మరి కేవలం అయోధ్యలోనే ఆలయం ఎందుకు కడతారు అని ఫరూక్ ప్రశ్నించారు. అయితే ఇదే సమయంలో పక్కనే ఉన్న జేడీయూ నేత పవన్ వర్మ ఆయనను అడ్డుకున్నారు. అయోధ్యలో రామ మందిరం ఎందుకు నిర్మించకూడదు. రాముడు జన్మించిన అయోధ్యలో హిందువులు మందిరం కట్టాలని అనుకుంటున్నారు. ఎందుకు నిర్మించకూడదు అని పవన్ వర్మ ఎదురు ప్రశ్నించారు. మందిరం నిర్మించాలా వద్దా అన్నది ప్రశ్న కాదు.. ఎలా నిర్మిస్తారన్నదే ప్రశ్న. అది బలప్రయోగం ద్వారానా లేక హింస ద్వారానా లేక పరస్పర అంగీకారంతోనా లేక కోర్టు ఆదేశాలతోనా అన్నది తేలాల్సి ఉంది అని పవన్ వర్మ అన్నారు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ముస్లింలందరూ కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెప్పారని ఈ సందర్భంగా ఫరూక్ స్పష్టం చేశారు. అయితే ఇద్దరి మధ్య అంగీకారం కుదిరినట్లే అని వర్మ అన్నారు.

1745
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles