షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభ ఎన్నికలు: రాజ్‌నాథ్

Sun,September 2, 2018 01:45 PM

Loksabha Elections will be held as per schedule says Rajnath Singh

న్యూఢిల్లీ: షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ముందస్తుకు అవకాశమే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. మొత్తం ప్రక్రియ 2019, మే 15లోపు పూర్తవుతుందని ఆయన తెలిపారు. జమిలీ ఎన్నికలపై దృష్టిసారించిన కేంద్రం.. డిసెంబర్‌లో నాలుగు రాష్ర్టాల ఎన్నికలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదని రాజ్‌నాథ్ చెప్పడం గమనార్హం.

ఇక జమిలీ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని కూడా రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రధాని మోదీ ఇప్పటికే చెప్పారు. ఎన్నికల సంఘం ఆ పని చూడాలి అని రాజ్‌నాథ్ చెప్పారు. జమిలీ ఎన్నికలు సాధ్యమే అయినా.. దానికి చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, అన్ని పార్టీలు అంగీకరిస్తేనే అది సాధ్యమని ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ చెప్పిన విషయం తెలిసిందే.

1671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles