రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు చ‌ర్చించిన లోక్‌స‌భ‌

Fri,July 12, 2019 10:13 AM

Lok Sabha sits till 11.58 pm to conclude debate on railways

హైద‌రాబాద్‌: లోక్‌స‌భ గురువారం అర్థ‌రాత్రి వ‌ర‌కు కొన‌సాగింది. రైల్వే అంశంపై మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి 11.58 నిమిషాల వ‌ర‌కు స‌భ్యులు చ‌ర్చించారు. ఇంత స‌మ‌యం స‌భ జ‌ర‌గ‌డం ఇది రికార్డు అని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి తెలిపారు. ఈ చ‌ర్చ‌లో సుమారు వంద మంది స‌భ్యులు పాల్గొన్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం రైల్వే మంత్రి స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌నున్నారు. అయితే రైల్వేల‌ను అమ్మాల‌నుకుంటున్న మోదీ స‌ర్కార్‌పై ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేశాయి. రైల్వే సేవ‌ల‌పై ప్ర‌భుత్వం దృష్టి పెట్ట‌డంలేద‌న్నారు. రైల్వే ప్రైవేటీక‌ర‌ణ‌ను కాంగ్రెస్‌, తృణ‌మూల్ తీవ్రంగా వ్య‌తిరేకించాయి. కాంగ్ర‌స్ పాల‌న‌లో క‌న్నా ప్ర‌స్తుతం రైల్వేల ప్ర‌ద‌ర్శ‌న బాగుంద‌ని బీజేపీ ఎంపీ సునిల్ కుమార్ సింగ్ తెలిపారు. గ‌త అయిదేళ్ల‌లో రైల్వే ప్ర‌మాదాలు 73 శాతం త‌గ్గిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles