లోక్‌సభ నిరవధిక వాయిదా

Fri,August 10, 2018 03:58 PM

Lok Sabha is adjourned sine die

న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. ఇవాళ లోక్‌సభను నిరవధిక వాయిదా వేశారు. వర్షాకాల పార్లమెంట్ జూలై 18న ప్రారంభమైంది. రాఫెల్ డీల్‌పై పార్లమెంటరీ కమిటీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్‌సభ, రాజ్యసభలోనూ ఇవాళ విపక్షాలు ఈ డిమాండ్లు చేశాయి. లోక్‌సభలో ఇవాళ ఆర్బిట్రేషన్ బిల్లును ఆమోదించారు. ఈ సమావేశాల్లో ఆమోదం పొందిన బిల్లులను స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు. జీరో అవర్‌లో జరిగిన చర్చలను ఆమె గుర్తు చేశారు. గత సమావేశాల కంటే ఈసారి వర్షాకాల సమావేశాలు చాలా ఉపయుక్తంగా సాగాయని స్పీకర్ అన్నారు. ఆ తర్వాత ఆమె సభను నిరవధిక వాయిదా వేశారు.

893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles