మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

Sun,May 19, 2019 05:16 PM

Lok Sabha Exit Poll Results will release in this evening

హైదరాబాద్ : మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల విడుదలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో అని దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 542 లోక్‌సభ స్థానాలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ర్టాల శాసనసభ స్థానాలకు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తుది విడుతలో 7 రాష్ర్టాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియనుంది. జార్ఖండ్ 3, బీహార్‌లోని ఒక స్థానంలో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా 55 స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

3095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles