సరైన సమయానికే లోక్‌సభ ఎన్నికలు : సీఈసీ

Fri,March 1, 2019 04:37 PM

Lok Sabha election will be held on time CEC assures amid India Pakistan tensions

లక్నో : త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలపై దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ప్రభావం చూపవు అని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా స్పష్టం చేశారు. గత రెండు రోజుల నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల బృందం అధికారులు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సునీల్ ఆరోరా మాట్లాడుతూ.. సరైన సమయానికే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందన్నారు. ఎన్నికల కమిషన్ కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు.. స్వదేశం, విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను పొందుపర్చాలని చెప్పారు. ఆస్తుల వివరాల్లో సరియైన సమాచారం లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు రాష్ర్టాల సరిహద్దుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని సునీల్ ఆరోరా పేర్కొన్నారు.

2948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles