ముగిసిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్

Sun,May 19, 2019 06:01 PM

lok sabha election polling end today

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 17వ లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. పలు రాష్ర్టాల్లో చిన్న చిన్న ఘర్షణలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం ఏడు విడుతల్లో 542 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 545 లోక్ సభ స్థానాలు ఉండగా.. ఇందులో రెండు స్థానాల్లో ఆంగ్లో ఇండియన్స్ ను నామినేట్ చేస్తారు. ఈ క్రమంలో 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 542 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరగని ఆ ఒక్క లోక్ సభ స్థానం తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఓ అభ్యర్థికి చెందిన నగదు పెద్ద మొత్తంలో లభించడంతో ఎన్నికను రద్దు చేశారు.

ఏప్రిల్ 11న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు.. ఏడు దశల్లో జరిగాయి. మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 11న 91 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 69.57 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో భాగంగా ఏప్రిల్ 18న 95 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో దశలో 69.44 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మూడో దశలో భాగంగా ఏప్రిల్ 23వ తేదీన 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, 68.40 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగో దశలో భాగంగా ఏప్రిల్ 29న 71 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 65.50 శాతం పోలింగ్ నమోదైంది. ఐదో దశలో భాగంగా మే 6వ తేదీన 51 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, 64.16 శాతం పోలింగ్ నమోదైంది. ఆరో దశలో భాగంగా మే 12న 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 64.40 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏడో దశ ఎన్నికలు మే 19న నిర్వహించగా.. సాయంత్రం 5 గంటల వరకు 64.63 శాతం పోలింగ్ నమోదైంది.

819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles