కొనసాగుతున్న ఆరోవిడత లోక్‌సభ పోలింగ్...

Sun,May 12, 2019 01:20 PM

Lok Sabha Election 2019 Total 25.13% voting till 12 noon

ఢిల్లీ: ఆరోవిడత లోక్‌సభ పోలింగ్ కొనసాగుతోంది. ఏడు రాష్ర్టాల్లో 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీహార్ 20.70, మధ్యప్రదేశ్ 28.25శాతం, ఉత్తరప్రదేశ్ 21.75శాతం, పశ్చిమబెంగాల్ 38.26శాతం, జార్ఖండ్ 31.27 శాతం, హరియాణ 23.23 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్‌కోవింద్ దంపతులు, ఔరంగాజేబ్ లైన్‌లోని పోలింగ్ బూత్‌లో రాహుల్‌గాంధీ, నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో సోనియాగాంధీ, లోథి ఎస్టేట్ పోలింగ్ బూత్‌లో ప్రియంకగాంధీ, రాబర్ట్ వాద్రా, సివిల్ లైన్ పోలింగ్ కేంద్రంలో సీఎం కేజ్రీవాల్, రాజేంద్రనగర్ పోలింగ్‌బూత్‌లో బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles