సీటు బెల్టు పెట్టుకోని పోలీసుల‌పై తిర‌గ‌బ‌డ్డ జ‌నం

Sat,September 14, 2019 10:53 AM

Locals in Bihar confronted Policemen for not wearing seat belts while driving

హైద‌రాబాద్‌: బీహార్‌లో ఓ పోలీసు వాహ‌నంపై జ‌నం తిర‌గ‌బ‌డ్డారు. సీటు బెల్టు పెట్టుకోకుండా.. వాహ‌నాన్ని న‌డుపుతున్న పోలీసుల‌పై జ‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డ్రైవింగ్ చేస్తున్న‌ప్పుడు మీరెందుకు సీటు బెల్టు పెట్టుకోవ‌డం లేద‌ని నిల‌దీశారు. వాహ‌నం మీద‌కు వ‌స్తూ తీవ్ర స్థాయిలో జ‌నం దుర్భాష‌లాడారు. దీంతో వాహ‌నం న‌డుపుతున్న పోలీసు సీటు బెల్టు పెట్టుకోవాల్సి వ‌చ్చింది. ట్రాఫిక్ నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తున్న వాహ‌న‌దారుల‌పై భారీ జ‌రిమానాలు వ‌స్తూల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్‌లో పోలీసుల్ని జ‌నం త‌మ‌దైన శైలిలో ప్ర‌శ్నించారు.1782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles