ప్రముఖ లింగాయత్ మాతే మహాదేవి ఇక లేరు

Fri,March 15, 2019 12:34 PM

Lingayat seer Maate Mahadevi passes away

బెంగళూరు : ప్రముఖ లింగాయత్ మరియు బసవధర్మ పీఠం అధ్యక్షురాలు మాతే మహాదేవి(74) ఇక లేరు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మార్చి 9న ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నిన్న తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మహాదేవి మృతిపట్ల లింగాయత్ పెద్దలు, కులస్తులు సంతాపం ప్రకటించారు. ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఇవాళ జరిగాయి.

1946, మార్చి 13న చిత్రదుర్గలోని ససాలట్టి గ్రామంలో మహాదేవి జన్మించారు. జ్ఞానవంతురాలైన ఆమె.. ఆధ్యాత్మిక జీవితానికి ఆకర్షితమయ్యారు. దీంతో జంగం దీక్ష చేపట్టి.. 1965-66 మధ్య కాలంలో సన్యాసిగా మారారు. 1969లో కర్ణాటక యూనివర్సిటీ నుంచి ఎంఏ తత్వశాస్త్రం చేశారు. బసత తత్వ దర్శనంతో పాటు హెప్పిట్ట హలు, తరంగిణి అనే నవలలు రాశారు. హెప్పిట్ట హలు అనే నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వరించింది. పలు పాఠశాలలను నెలకొల్పి పేద పిల్లలకు విద్యను అందించింది. మహాదేవీ సమాజానికి అందించిన సేవలను గుర్తించి.. 2013లో డివైన్ హ్యాండ్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ చెన్నై ఆమెను డాక్టరేట్‌తో సత్కరించింది. లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పించాలని మహాదేవీ ఉద్యమం చేపట్టారు.

1015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles