ఉత్తరప్రదేశ్‌లో పిడుగులు.. 32 మంది మృతి

Mon,July 22, 2019 11:19 AM

Lightning Strikes Kill 32 In Uttar Pradesh

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడు పిడుగులు పడుతున్నాయి. పిడుగుపాటుకు 32 మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాము కాటుకు ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్‌, ఫతేపూర్‌లో ఏడుగురు చొప్పున, ఝాన్సీలో ఐదుగురు, జలౌన్‌లో నలుగురు, హమీర్‌పూర్‌లో ముగ్గురు, ఘాజిపూర్‌లో ఇద్దరు, జౌన్‌పూర్‌, ప్రతాప్‌ఘర్‌, కాన్పూర్‌ దేహత్‌, చిత్రకోట్‌లో ఒకరి చొప్పున మృతి చెందారు. మృతుల కుటుంబాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు.

519
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles