వామ్మో.. జనావాసాల్లోకి వచ్చిన చిరుత పులి:వీడియో వైర‌ల్‌

Sat,March 10, 2018 11:08 AM

Leopard strays into house injures three before being captured


ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అడవి నుంచి దారితప్పిన చిరుత పులి ఒకటి జనావాసాల్లోకి వచ్చి హంగామా సృష్టించింది. అంతటితో ఆగకుండా ఓ గ్రామంలోని ఇంట్లో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన శనివారం ఇండోర్‌లోని పల్హర్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనను జంతుప్రదర్శనశాలకు చెందిన అధికారి ఒకరు వివరిస్తూ.. ఇండోర్‌కు సమీపంలోని ఓ అడవి నుంచి 8ఏళ్ల వయసుగల చిరుత పులి ఇక్కడికి వచ్చింది. స్థానికులను భయబ్రాంతులకు గురిచేసి వారిపై దాడికి దిగింది. చిరుతను పట్టుకునేందుకు అధికారులు చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు ఫారెస్ట్ స్టాఫర్లతో పాటు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన సిబ్బంది ఒకరు గాయపడ్డారు. అని కమ్లా నెహ్రూ జూ ఇన్‌ఛార్జి ఉత్తమ్ యాదవ్ తెలిపారు. చివరికి దీన్ని బంధించామని, అవసరమైన వైద్య పరీక్షలు పూర్తి చేసిన తరువాత మళ్లీ అడవిలోకి వదిలేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాలకు చిరుతలతో పాటు పలు వన్యప్రాణి జంతువులు జనావాసాల్లోకి తరచూ వస్తూనే ఉన్నాయి.

4956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS