30 అడుగుల లోతు బావిలో పడిన చిరుతను ఎలా కాపాడారో తెలుసా?

Mon,October 8, 2018 04:11 PM

Leopard Rescued From Drowning In 30-Foot Well In Maharashtra

30 అడుగుల లోతు బావిలో పడిన చిరుతను కాపాడిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, వైల్డ్‌లైఫ్ ఎస్‌వోఎస్ సిబ్బందిని అక్కడి స్థానికులు, నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఓటూర్ రేంజ్‌లోని యాదవ్వాడిలో చోటు చేసుకున్నది. యాదవ్వాడిలో ఉన్న ఓ నీటి బావిలో 7 ఏండ్ల ఆడ చిరుత ప్రమాదవశాత్తు పడిపోయింది. దాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖకు సమాచారం అందించారు. వైల్డ్‌లైఫ్ ఎస్‌వోఎస్ సాయంతో బోనును బావిలోకి దించి దానికి ఎటువంటి గాయాలు కాకుండా.. దాన్ని అందులో పంపించి పైకి తీసుకొచ్చారు. అనంతరం దాన్ని మనిక్దోహ్ లియోపార్డ్ రెస్క్యూ సెంటర్‌కు తరలించి అబ్జర్వేషన్‌లో ఉంచారు. చిరుత రెస్క్యూకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుతకు ఎటువంటి గాయాలు కాకుండా.. 30 అడుగుల లోతులో పడిన దాన్ని చాకచక్యంగా బయటికి తీసిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, వైల్డ్‌లైఫ్ సిబ్బందిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.

4554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles