షీలా దీక్షిత్ పార్థివదేహానికి నేతల నివాళులు

Sun,July 21, 2019 10:20 AM

leaders pay tribute to delhi ex chief minister sheila dixit

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గుండె జబ్బుతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూసిన విషయం విదితమే. కాగా ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని నిజాముద్దీన్ ఏరియాలో ఉన్న ఆమె నివాసంలో ఆమె పార్థివ దేహాన్ని ఉంచారు. కాగా మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్‌తోపాటు పలువురు ఇతర ముఖ్య నేతలు షీలా దీక్షిత్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles