రాహుల్ గాంధీపై లేజ‌ర్ లైట్‌...

Thu,April 11, 2019 04:41 PM

Laser pointed at Rahul Gandhi by sniper, alleges Congress party

హైద‌రాబాద్: రాహుల్ గాంధీ ప్రాణానికి ముప్పు ఉంద‌ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అమేథీలో నామినేష‌న్ వేసేందుకు వెళ్లిన స‌మ‌యంలో.. రాహుల్ త‌ల‌పై లేజ‌ర్‌ను టార్గెట్ చేశారు. నిన్న మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఓ స్నైప‌ర్ .. రాహుల్ త‌ల‌పై లేజ‌ర్ బీమ్‌తో టార్గెట్ చేసిన‌ట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్న‌ది. రాహుల్‌కు యూపీ ప్ర‌భుత్వం స‌రైన భ‌ద్ర‌త క‌ల్పించ‌లేద‌ని ఆ పార్టీ ఆరోపించింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్ర‌స్తుతం రాహుల్‌కు ఎస్పీజీ పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర హోంశాఖ స్పందించింది. సెల్‌ఫోన్ నుంచి లేజ‌ర్ లైట్ వ‌చ్చిన‌ట్లు ఎస్పీజీ డైర‌క్ట‌ర్ వెల్ల‌డించార‌ని హోంశాఖ తెలిపింది. రాహుల్ క‌నుబొమ్మ‌పై గ్రీన్ రంగులో ఉన్న లేజ‌ర్ లైట్ ఉన్న ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఏఐసీసీ ఫోటోగ్రాఫ‌ర్ వాడుతున్న కెమెరా నుంచి ఆ గ్రీన్ లైట్ వ‌చ్చి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

3334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles