ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం

Thu,January 10, 2019 07:47 AM

largest cricket stadium in the world is in Ahmedabad

అహ్మదాబాద్: 63 ఎకరాలు.. రూ.700 కోట్ల ఖర్చుతో గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్‌లోని మొతెరాలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం కొనసాగుతున్నది. లక్షమంది సీటింగ్ సామర్థ్యంతో ఈ స్టేడియం నిర్మిస్తున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమల్ నత్వాని వెల్లడించారు. 2018లో శంకుస్థాపన చేసిన ఈ స్టేడియం నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ఇది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టని, ఈ స్టేడియం దేశానికే తలమానికంగా నిలువనుందని ఆయన చెప్పారు. 90వేల సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ స్టేడియం ఉండగా.. నిర్మాణం పూర్తి చేసుకుంటే మొతేరా ఈ రికార్డును బద్దలు కొట్టనుంది.

3922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles