టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

Tue,March 26, 2019 09:06 PM

Kurupam TDP candidates nomination rejected

విజయనగరం: విజయనగరం జిల్లా కురుపాం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాల్లో కీలక మలుపు. ఎన్నికలకు ముందే అధికార టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జనార్ధన్‌ ధాట్రాజ్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. కుల ధ్రువీకరణ పత్రంలో తేడా ఉండటంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారు. జనార్ధన్‌ ధాట్రాజ్‌ ఎస్టీ కాదని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిశీలించిన అధికారి విశ్వేశ్వరరావు జనార్ధన్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు వెల్ల‌డించారు. దీంతో టీడీపీ నాయ‌కులు, శ్రేణులు నిరాశ‌గానే వెనుదిరిగారు.

7772
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles