నాణేల రూపంలో ఎన్నికల సెక్యూరిటీ డిపాజిట్..ఫొటోలు వైరల్

Mon,March 25, 2019 07:32 PM

Kuppalji Devadoss paying his election security deposit in coins


చెన్నై: కుప్పాల్జి దేవదాస్ స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. చెన్నై సౌత్ లోక్ సభ స్థానం నుంచి కుప్పాల్జి దేవదాస్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చిన దేవదాస్..ఎన్నికల సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాల్సిన నగదు చెల్లించారు. అయితే ఆయన డిపాజిట్ నగదు మొత్తాన్నినాణేల రూపంలో తీసుకొచ్చి..అందరిచూపు తనవైపు తిప్పుకున్నారు. నాణేలతో వచ్చిన దేవదాస్ ను అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles