ప్రియాంకాగాంధీకి సీఎం కుమారస్వామి శుభాకాంక్షలు

Wed,January 23, 2019 06:26 PM

Kumaraswamy welcomes Priyanka entry into politics

బెంగళూరు: ప్రియాంకాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడాన్ని కర్ణాటక సీఎం హెచ్ డీ కుమారస్వామి స్వాగతించారు. తూర్పు యూపీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియమితులైన సందర్భంగా..సీఎం కుమారస్వామి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియాంక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. యూపీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ఒరవడిని సృష్టించాలని ఆకాంక్షిస్తున్నట్లు కుమారస్వామి ట్వీట్ చేశారు. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర ప్రియాంకా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.

1715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles