బ‌ల‌ప‌రీక్ష‌ కోరిన కుమార‌స్వామి

Fri,July 12, 2019 01:47 PM

Kumaraswamy decided to seek trust vote in Karnataka Assembly

హైద‌రాబాద్‌: క‌ర్నాట‌క సీఎం హెచ్‌డీ కుమార‌స్వామి.. బ‌ల‌ప‌రీక్ష‌కు డిమాండ్ చేశారు. ఇవాళ అసెంబ్లీ మొద‌లైన త‌ర్వాత‌.. బ‌ల‌ప‌రీక్ష పెట్టాలంటూ స్పీక‌ర్‌ను సీఎం కుమార‌స్వామి అభ్య‌ర్థించారు. దానికి టైం ఫిక్స్ చేయాల‌ని కోరారు. కొంద‌రు ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల‌.. రాష్ట్ర రాజ‌కీయాలు అనేక మ‌లుపులు తిరుగుతున్నాయ‌ని సీఎం అన్నారు. అందుకే విశ్వాస ప‌రీక్ష కోసం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు సీఎం చెప్పారు. అంత‌క‌ముందు క‌ర్నాట‌క సంక్షోభంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్ ఆలోచిస్తున్నారా అన్న విష‌యాన్ని తెలుసుకోవాల‌ని సుప్రీం పేర్కొన్న‌ది. రెబ‌ల్ ఎమ్మెల్యేల అనర్హ‌త వేటుపై ప్ర‌స్తుతం తీర్పును త‌ట‌స్థంగా ఉంచిన‌ట్లు సుప్రీం తెలిపింది. మంగ‌ళ‌వారం ఈ కేసుపై మ‌ళ్లీ విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది.

1684
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles