ప్రజల విశ్వాసం కోల్పోయామని ఒప్పుకున్నారు: యడ్యూరప్ప

Thu,July 18, 2019 09:37 PM

kumaraswamy confirmed himself that he has lost confidence says yeddyurappa


బెంగళూరు: కర్ణాటక శాసనసభలో విశ్వాసపరీక్ష పెట్టాలని మేం డిమాండ్‌ చేస్తున్నామని ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప అన్నారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యుల ఆందోళన మధ్య స్పీకర్‌ సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విధానసభ వద్ద యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ..విశ్వాస పరీక్షకు డిమాండ్‌ చేస్తే..సీఎం కుమారస్వామి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. బలపరీక్షలో నెగ్గరని, ప్రజల విశ్వాసం కోల్పోయామని సీఎం కుమారస్వామి తనకు తానే ఒప్పుకున్నారని చెప్పారు. ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు ఇలా చేశారని యడ్యూరప్ప అన్నారు. రాష్ట్రంలో తుగ్లక్‌ దర్బారును ఎంతకాలం భరించాలని బీఎస్‌ యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మేం కోర్టు ఆదేశాల మేరకు నడుచుకున్నాం. సంకీర్ణ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది. గవర్నర్‌ సూచనలను పట్టించుకోలేదని యడ్యూరప్ప ఆరోపించారు. సభలో కాంగ్రెస్-జేడీఎస్ కు 98 మంది ఎమ్మెల్యేలుండగా..బీజేపీకి 105 మంది సభ్యుల బలముందని ప్రజలందరికీ తెలుసునన్నారు.

580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles