కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో మంత్రి కేటీఆర్ భేటీWed,January 11, 2017 11:45 AM
కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో మంత్రి కేటీఆర్ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, గనుల శాఖ మంత్రి సమావేశమయ్యారు. ప్రాంతీయ విమానయాన అనుసంధానం కింద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన శాఖ మధ్య ఒప్పందం జరిగింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ కేంద్ర మంత్రులను కలవనున్నారు.

దేశవ్యాప్తంగా విమానయాన రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకున్నామని చెప్పారు. విమానయాన రంగంలో నైపుణ్యత కూడా చాలా అవసరమన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రీజినల్ కనెక్టివిటీ స్కీంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గతంలోనే కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు కేంద్రం టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. బేగంపేట ఎయిర్ పోర్టును స్కిల్ డెవలప్ మెంట్ అభివృద్ధికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని మంత్రి చెప్పారు.


మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి అనంత్ గీతేతో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భేటీ అయ్యారు. కేటీఆర్‌తోపాటు మంత్రి జోగు రామన్న, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే బాపురావు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.-మధ్యాహ్నం 2.30గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసాతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. రాష్ర్టానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై సమావేశంలో వివరిస్తారు.

-సాయంత్రం 5.30గంటలకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. సిరిసిల్లలో మెగా టెక్స్‌టైల్ పార్కుతోపాటు వివిధ పథకాల కింద కేంద్ర నిధులతో పవర్‌లూమ్ యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ రూపంలో సాయం చేయాలని కోరే అవకాశం ఉంది.

3384
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS