సిద్ధగంగ స్వామీజీకి భారతరత్న ఇవ్వాల్సిందే

Fri,January 18, 2019 02:30 PM

K'taka CM supports Bharatratna for SidhaGANGA SWAMY

శతాధిక వృద్ధుడైన సిద్ధగంగ మఠాధిపతి సిద్ధగంగ స్వామీజీకి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌కు కర్నాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి మద్దతు తెలిపారు. అలాంటివారికి ఇస్తేనే అవార్డుకు గౌరవం పెరుగుతుందని అన్నారు. 111 సంవత్సరాల స్వామీజీ ప్రస్తుతం అస్వస్థులుగా ఉన్నారు. తుమకూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో స్వామీజీ కీలక పాత్ర పోషించారు. ఎందరికో ఆయన స్ఫూర్తిగా నిలిచారు. తుమకూరులోని మఠం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రిగదిలో ఆయన చికిత్స పొందుతున్నారు. విద్యా, వైద్య రంగాల్లో స్వామీజీ ఎనలేని సేవలు అందించారని సీఎం కుమారస్వామి అన్నారు. అవార్డు విషయమై ప్రధాని నరేంద్రమోదీకి లేఖరాస్తానని, అవసరమైతే స్వయంగా కలిసి మాట్లాడుతానని చెప్పారు. ఇదిలాఉండగా స్వామీజీ ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఇదివరకు ఆయనకు పిత్తాశయం రాళ్ల తొలగింపు శస్త్రచికిత్స జరిగింది.

1256
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles