5వేలకు పైగా పాములను రక్షించి..

Sun,January 14, 2018 12:40 PM

Krishna Chandra Gochhayat has rescued more than 5,000 snakes Till now


ఒడిశా: ఇతడి పేరు కృష్ణ చంద్ర గొచ్ఛాయత్. ఉథాని నువాగావ్ గ్రామానికి చెందినవాడు. కృష్ణ ఇప్పటివరకు 5వేలకు పైగా పాములను రక్షించి స్నేక్ రెస్క్యూయర్ (పాములు కాపాడే వ్యక్తి)గా చుట్టుపక్కల చాలా ఫేమస్ అయ్యాడు. కృష్ణ కేవలం పాములను కాపాడటమే కాకుండా ఏనుగులు, కోతులు, ఇతర అడవి జంతువులకు ప్రాథమిక చికిత్స చేస్తూ జీవజాతుల పట్ల తనకున్న మక్కువను తెలియజేస్తున్నాడు. ఈ ఎనిమల్ లవర్‌ను మీడియా పలుకరించగా..నేను పాములే కాకుండా, ఎలుగుబంట్లు, పులులు, ఏనుగులు, కోతులు, చిరుతలు, పక్షులను కాపాడాను. జంతువులకు సాయం చేయడంలో నాకు ఎంతో సంతృప్తి లభిస్తుంది. జంతువులు ఉంటేనే అడవులు ఉనికిని కోల్పోకుండా ఉంటాయన్నాడు. తద్వారా మానవాళి మనుగడకు ముప్పువాటిల్లకుండా ఉంటుందని తెలిపాడు.


3611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles