సర్టిఫికెట్లు తడిసి ముద్దయ్యాయని విద్యార్థి ఆత్మహత్య

Mon,August 20, 2018 02:47 PM

Kozhikode Teen Ends Life After Rains Destroy School Certificates

తిరువనంతపురం : కేరళ రాష్ర్టాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం విదితమే. ఇప్పుడిప్పుడే కాస్త వాన తగ్గుముఖం పట్టింది. దీంతో పునరావాస కేంద్రాల్లో ఉంటున్న ప్రజలు.. తిరిగి తమ నివాసాలకు చేరుకుంటున్నారు. ఓ విద్యార్థి సర్టిఫికెట్లు వర్షపు నీటికి తడిసి ముద్దవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన కోజికోడ్ జిల్లాలోని కరంతూరులో సోమవారం చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువకుడు ఇటీవలే పన్నెండో తరగతి పూర్తి చేసుకున్నాడు. ఐటీఐలో అడ్మిషన్ కూడా తీసుకున్నాడు. కాలేజీకి వెళ్లేందుకు కొత్త బట్టలు కొనుక్కున్నాడు. డబ్బులు కూడా సమకూర్చుకున్నాడు.

ఇంతలోనే భారీ వర్షాలు రావడంతో ఆ యువకుడి నివాసంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ఆ కుటుంబ పునరావాస కేంద్రానికి తరలివెళ్లింది. వర్షాలు తగ్గుముఖం కావడంతో.. విద్యార్థి కుటుంబం తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఉన్న సర్టిఫికెట్లు వర్షపు నీటికి తడిసిముద్దవడాన్ని చూసి విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇక తాను ఉన్నత చదువులకు దూరం అవుతున్నానని భావించి.. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

4698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles