కరుణానిధికి సంతాపం ప్ర‌క‌టించిన త‌మిళ సినీప్ర‌ముఖులు

Wed,August 8, 2018 11:43 AM

kollywood celebrities praise karunanidhi

త‌మిళ‌నాడు ప్రియ‌త‌మ నేత కరుణానిధి మృతి ప‌ట్ల త‌మిళ సినీ పరిశ్ర‌మ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. కోలీవుడ్‌కి చెందిన టాప్ స్టార్స్ ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్, విశాల్ అజిత్ ,ధనుష్‌, సూర్య త‌దిత‌రులు రాజాజీహాల్‌లో ఉన్న కరుణానిధి పార్ధివదేహాంపై పుష్ప‌గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఎంకే స్టాలిన్, కనిమొళితో పాటు కరుణానిధి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. కరుణానిధి మృతికి సంతాపంగా సినిమా షూటింగ్‌ల‌తో పాటు థియేట‌ర్స్ అన్ని మూత‌ప‌డ్డాయి. ‘నా కళైంజ్ఞర్‌ను కోల్పోయాను. ఈ రోజును అస్సలు మరిచిపోను. నా జీవితంలో ఇది బ్లాక్ డే అంటూ ర‌జనీకాంత్ భావోద్వేగంతో మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 4గం.ల‌కి కరుణానిధి అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.



1252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS